![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -351 లో.. ముకుంద కావాలనే భవానీని రెచ్చగొడుతుంది. ఇంట్లో అందరు కృష్ణ చేసిన కాఫీ తాగుతున్నారు. రోజు అక్కడ నుండి కాఫీ వస్తుందని లేనిపోనివి కల్పించి ముకుంద చెప్తుంది. దాంతో భవాని కోపంగా రేవతిని పిలుస్తుంది. ఆ తర్వాత వెటకారంగా మాట్లాడిన మధుని భవాని కొడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి కలిసి ఇంట్లోకి వస్తారు. ఇంట్లో సిచువేషన్ తెలియని కృష్ణ.. సారీ అత్తయ్య కాఫీ లేట్ అయిందంటు రేవతికి చెప్తుండగా.. రేవతి సైగ చెయ్యడంతో కృష్ణ సైలెంట్ గా ఉంటుంది.
నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు చీప్ గా చూసిన కూడా నువ్వు ఎందుకు కృష్ణ వాళ్ళ కోసం కాఫీ అంటు తీసుకొని వచ్చావని మురారి అంటాడు. ఏంటి మురారి కేసు తెలకముందే నిర్ణయం తీసుకుంటున్నాడని భవాని అనగానే.. కృష్ణ ఎప్పుడైనా ఇంట్లోకి రావచ్చు, పోవచ్చని ముందే చెప్పాను కదా పెద్దమ్మ అని మురారి అంటాడు. చెప్పావ్ కానీ టీలు, చేపలపులుసులు తీసుకొని రమ్మని చెప్పలేదని భవాని అంటుంది. రెండు రోజుల్లో కృష్ణ ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని మురారి చెప్పి కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత మధు ఫ్రస్ట్రేషన్ భరించలేక డ్రింక్ తాగాలని మందు బాటిల్ కోసం వెతుకుతు ఉంటాడు. మరొకవైపు ఇంట్లో విషయాలు గౌతమ్ కి చేరవేసే పనిలో నందు ఉంటుంది. అప్పుడే నందు దగ్గరకి మధు వస్తాడు. ఇద్దరు కృష్ణ, మురారీల గురించి మాట్లాడుకుంటారు. అసలు ఈ పెద్దమ్మకి ఎవరు ఎదరు చెప్పేవారు కాదు కానీ మురారి ఈ మధ్య పెద్దమ్మతో ధైర్యంగా మాట్లాడుతున్నాడని మధు అంటాడు. ఈ మధ్య కృష్ణ నా వైపు డౌట్ గా చూస్తుందని దేవ్ తో ముకుంద చెప్తూ ఉంటుంది. అప్పుడే మధు వెళ్తుంటాడు. దేవ్ పై డౌట్ రాకుండా కృష్ణ చాలా మంచిదంటూ ముకుందతో చెప్తూ ఉంటాడు. కానీ మధు మాత్రం దేవ్ పై డౌట్ గా ఉంటాడు.
మరొకవైపు కృష్ణ సాంగ్స్ వింటూ ఉంటుంది. మురారి రెడీ అయి కృష్ణ అంటు పిలుస్తూ ఉంటాడు. మురారీని పై నుండి దేవ్, ముకుంద ఇద్దరు చూస్తు ఉంటారు. అసలు నిన్ను ఏమాత్రం కూడ చూడడు.. పట్టించుకొడు.. నువ్వు ఎందుకు మురారి కావాలని అనుకుంటావో నాకు అర్థం కాదని దేవ్ అనగానే.. దేవ్ పై ముకుంద కోప్పడుతుంది. మరొకవైపు కృష్ణ హడావిడిగా వస్తు ఉంటే కాలు బెనుకుతుంది. అదేసమయంలో అందరు టిఫిన్ చెయ్యడానికి రెడీ అవుతుంటారు. నేను వడ్డిస్తాను.. ఎలాగు రెండు రోజుల్లో ఇంటి కోడలు నేనే కాదా అని ముకుంద అంటుంది. కొందరికీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది. నీకు కాన్ఫిడెన్స్ ఉందని ముకుందకి సపోర్ట్ గా భవాని అంటుంది. అప్పుడే కృష్ణని ఎత్తుకొని మురారి ఇంటి లోపలికి వస్తాడు. తరువాయి భాగంలో పరిమళ మేడమ్ తో మురారి ఫోన్ మాట్లాడుతు ఉంటాడు. అప్పుడే పరిమళకి దేవ్ కన్పిస్తాడు. మురారీకి సర్జరీ చేయించింది అతనే అన్నట్టుగా అతని వంక పరిమళ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |